Karthika Deepam2 : నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారా కార్తిక్ బాబు.. దీప ఎమోషనల్!
on Jul 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -89 లో.....శౌర్య తండ్రిని నేనే అని కార్తీక్ చెప్పగానే.. దీప షాక్ అవుతుంది. అప్పుడే శౌర్య రావడం తో తను ఏమైనా విని ఉంటుందా అని దీప అనుకుంటుంది. శౌర్యని లోపలికి తీసుకొని వెళ్లి పడుకోపెట్టి మళ్ళీ బయటున్నా కార్తీక్ దగ్గరికి కోపంగా వస్తుంది దీప. నువ్వు నా కూతురు తండ్రి ఏంటని అడుగుతుంది. అంటే దీప మీరు కొంచెం అర్థం చేసుకోండి.. నేను అలా చెప్తే.. ఇక వాడు మీ జోలికి రాడు.. అందుకే అలా చెప్పానంటూ కార్తీక్ పశ్చాతాపంగా మాట్లాడతాడు.
నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా కార్తిక్ బాబు.. తల్లిని నేను బ్రతుకే ఉన్నాను కదా.. నేను నా బిడ్డను కాపాడుకుంటాను కదా.. ఇన్నిరోజులు ఒక మంచి వ్యక్తిని అపార్థం చేసుకున్నానని బాధ పడ్డాను.. మీరు నేను అనుకున్న దానికంటే చాలా మంచివారు. ఒక నింద వేసినందుకు తాళి కట్టిన వాడిని క్షమించలేదు.. ఆ నింద నిజం చేసిన వాడిని ఎలా క్షమిస్తానని కార్తిక్ తో దీప చెప్తూ ఎమోషనల్ అవుతుంది. మీరన్నది కూడా ఎవరి ముందు.. నింద వేసి అక్రమసంబంధం అంటకట్టిన నా భర్త ముందు.. వాడి అనుమానాలన్నింటిని నిజం చేశారు. ఇప్పుడు వాడు వెళ్లి మీ ఇంట్లో చెప్తే, వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా.. ఇన్నిరోజులు ఎవరేం అన్న నాకు మర్యాద ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్న మాటతో సర్వనాశనం అయింది. ఏ విలువ లేనట్టు నిలబెట్టారు. ఇవన్నీ నా బిడ్డ వింటే నా పరిస్థితేంటి ఈ అబద్దమే నిజమనుకుంటే.. ఆ దుర్మార్గుడు తండ్రి అని చెప్పలేకే కదా ఇన్ని రోజులు అబద్దం చెప్పేదని దీప ఎమోషనల్ అవుతుంది.
కార్తీక్ ఏం చెప్పిన దీప వినే సిచువేషన్ లో లేదు. మరొకవైపు జ్యోత్స్న కార్తీక్ అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది. శౌర్యని తీసుకొని నరసింహా వస్తాడా అని శోభ ఎదురు చూస్తుంటే.. అప్పుడే నర్సింహా వచ్చి ఆ శౌర్య కార్తీక్ బిడ్డ అంట అంటాడు. నీ నుండి తప్పించడానికి అబద్ధం చెప్పారు.. ఎట్టి పరిస్థితిలోను దీప తప్పు చేసే మనిషి కాదని అనసూయ అంటుంది. ఆ తర్వాత నర్సుతో శౌర్యని చూడమని చెప్పి దీప ఇంటికి వెళ్తుంది. మరొకవైపు దీప అన్న మాటలు గురించి కార్తిక్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏంటి అవుట్ హౌస్ లో లైట్ వేసి ఉందని జ్యోత్స్న అనుకుంటుంది. దీప తన నాన్న ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read